జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగిన ఈ సమావేశంలో ఇ-వే బిల్లు విధానాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంట్రా-స్టేట్ ఇ-వే బిల్లు జూన్ 1 నుంచి తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వస్తువుల అంతర్ రాష్ట్ర ఇ-వే బిల్లు మాండేటరీ అని జీఎస్‌టీ కౌన్సిల్ ప్రకటించింది. దీన్ని ట్రయల్ రన్ కోసం జనవరి 16నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇ-వే బిల్లు విధానం, ఇన్‌వాయిస్ మ్యాచింగ్ తదితర అంశాలపై చర్చించిన 24వ జీఎస్‌టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రూ. 50వేల విలువకంటే ఎక్కువ వస్తువులను రవాణా చేస్తే తప్పనిసరిగా ఇ-వే బిల్లు, రాష్ట్రంలో 10 కి.మీ లోపు వస్తువులను రవాణా చేస్తే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు ఉండాలి.
కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 1 నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్-స్టేట్ , ఇంట్రాస్టేట్ ఇ-వే బిల్లును అమలు చేస్తాయని కౌన్సిల్ తెలిపింది. అయితే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు విధానం మాత్రం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
కాగా అంతర్ రాష్ట్ర వస్తువుల రవాణా, పన్నుల ఎగవేత నిరోధాన్ని ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. దీనిపై రివ్యూ నిర్వహించిన మండలి ఈ నిర్ణయం అమలు ఫిబ్రవరికి ప్రీ పోన్ చేసింది. అలాగే నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment