జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్: వరుసగా పలు బ్యాంకుల్లో దొంగతనాలకు పాల్పడుతూ, వాహనాలను అపహరిస్తూ ప్రజలను భయందోళనకు గురి చేస్తున్న ఓ అంతర్ రాష్ర్ట దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. దొంగల నుంచి నగదు, ఇన్నోవా వాహ నం, తూటాలు, కత్తులు, గ్యాస్, ఆక్సిజన్ సిలిండర్, డ్రిల్లింగ్ మిషన్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సంబంధించిన వివరాలను ఆదివారం జహీరాబాద్ పోలీసు స్టేషన్‌లో జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ రావు వెల్లడించారు. కర్నాటక రాష్ర్టం గుల్‌బర్గాకు చెందిన ఘోరే మహబూబ్, అబ్దుల్ రజాక్, చాంద్‌పాషా, మహమూద్, షఫీ, ఖలీద్, బాబా, ఖాల మహబూబ్‌లు ఓ ముఠాగా ఏర్పడి బ్యాంక్ దోపిడీలతో పాటు వాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. గుల్బ ర్గా పట్టణంలోని టిప్పుసుల్తాన్ చౌక్, అలంద్ చౌక్‌లో నివాసముంటున్న వీరు మూడేళ్ల నుంచి ఏ టూ జెడ్ పేరుతో స్క్రాప్ షాపు నడుపుతున్నారు.
దుకాణం కేంద్రంగా చేసుకొని బ్యాంక్ దోపిడీలు, ట్రాక్టర్లు, కార్లు, డీసీఎం వ్యాన్లు, టాటా సుమోల చోరీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత సంవత్సరం జహీరాబాద్ మం డలంలోని కొత్తూర్(బి) సిండికేట్ బ్యాం క్‌లో దొంగతనం చేశారు. బ్యాంక్ వెనుక భాగంలోని కిటికీ గుండా బ్యాంక్‌లోకి ప్రవేశించి ఆక్సింజన్ సిలిండర్, గ్యాస్‌కట్టర్ సాయంతో లాకర్‌ను ధ్వంసం చేశా రు. అందులో ఉన్న రూ.3,70 లక్షలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఆక్సిజన్ సిలిండర్ అక్కడే వదిలివెళ్లారు. అదేనెలలో కోహీ ర్ మండలంలోని కవేలి గ్రామంలోని సిండికేట్ బ్యాంక్‌లో దొంగతనానికి యత్నించగా సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశం అక్కడికి చేరుకుని వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐ గాయపడిన విషయం విదితమే. జులై నెలలో మండలంలోని మల్‌చెల్మా సిండికేట్ బ్యాంక్‌లో కూడా చోరీకి యత్నించి విఫలమైయ్యారు. అలాగే సంగారెడ్డి, సదాశివపేట,తూఫ్రాన్‌లతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మహ్మదాబాద్ పో లీస్ స్టేషన్ పరిధిలో టాటా సుమో, ట్రా క్టర్,డీసీఎం వ్యాన్ తదితర వాహనాలను అపహరించారు.
సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందున్న ఏటీఎంలో కూడా చోరీకి విఫలయత్నం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. కాగా ఆది వారం జహీరాబాద్ పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలను తనఖీ చేస్తుండగా దానిలో భాగంగా కేఏ 01 ఎంసీ2053 నంబర్‌గల ఇనోవా కారు ను ఆపి తనిఖీచేశారు. అందులోని వ్యక్తుల ప్రవర్తన తీరు అనుమానం కలిగించడంతో వారిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు వారి వద్ద ఉన్న 1,83,600 రూపాయల నగదు, రెండు ఆక్సిజన్, ఒకటి ఎల్‌పీజీ సిలిండర్, గ్యాస్ కట్టర్, ఆక్సాబ్లేడ్లు, రెండు కత్తులు, డ్రిల్లింగ్ మిషన్, గడ్డపార, చేతి గ్లౌస్‌లు, తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ రావు తెలిపారు. నిందితులు ఘోరె మహబూ బ్, అబ్దుల్ రజాక్, చాంద్‌పాషా, మహమూద్, షఫీలను అరెస్టు చేశామన్నారు. ఎస్‌ఐ వెంకటేశంపై కాల్పులు జరిపిన బాబాతో పాటు ఖలీద్, కాల మహబూబ్‌లు పరారీలో ఉన్నారని చెప్పారు.
వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ దొంగల ముఠాను పట్టుకొన్న జహీరాబాద్ టౌన్ సీఐ నరేందర్, పట్టణ ఎస్‌ఐ శివలింగం,పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశం, పలువురు ఎస్‌ఐలు ఉన్నారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
Published Mon, Oct 7 2013 2:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement