బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నలుగురు మట్కా బీటర్లను అరెస్ట్ చేసినట్లు మండల ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి తెలిపారు.
బుక్కరాయసముద్రం(అనంతపురం): బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నలుగురు మట్కా బీటర్లను అరెస్ట్ చేసినట్లు మండల ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి తెలిపారు. శనివారం సాయంత్రం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు. కేసుకు సంబందించిన వివరాలను ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మట్కా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేటాయించామన్నారు. వీటిలో ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీకు చెందిన బోయ శివయ్య, మండల పరిదిలోని నీలాంపల్లి గ్రామానికి చెందిన షేక్ మసూద్‌వలి, అదే గ్రామానికి చెందిన షేక్ చాంద్‌బాషా, జంతులూరు గ్రామానికి చెందిన బోయ సూర్య నారాయణలు గుట్టు చప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరిపై ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి ప్రత్యేక నిఘా వేశారు.
శనివారం సాయంత్రం ఈ నలుగురు చిక్కవడియార్ చెరువు సమీపంలో మట్కా నిర్వహిస్తున్నారని సమాచారంతో ఎస్‌ఐ పోలీస్ బృందంతో మెరుపు దాడి నిర్వహించారు. వీటిలో నలుగురికి అదుపుతోకి తీసుకుని వారి వద్ద నుంచి 80,150 రుపాయలు, పెన్నులు, మట్కా చీటిలు నాలుగు సెల్‌ఫోన్లును స్వాదీనం చేసుకున్నామన్నారు. నిందుతులను కోర్టులో హాజరు పుస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ జనార్థన్,లక్ష్మినారాయణ, కరియప్ప, పద్మావతి, ప్రసాద్, రఘు, సంతోష్, శ్రీనివాసులు, బాషా, తదితరులు పాల్గొన్నారు.