
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు : నా భార్య నాకు కావాలి, దయతో ఆదుకోవాలని ఓ నిస్సహాయక భర్త కనబడిన వారందరినీ వేడుకుంటున్నాడు. హుబ్లీ బసవనబాగేవాడికి చెందిన సిద్ధలింగప్ప అనే ఆ నిస్సహాయక వ్యక్తి వివరాల్లోకి వెళితే.. స్వతహాగా అక్క కూతురైన జ్యోతిని 2004లో పెళ్లి చేసుకున్నాడు. అంతోఇంతో చదువుకున్న భార్యకు ఐటీఐలో శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత ఉన్న రెండు సెంట్ల స్థలం అమ్మి ఆ డబ్బులు ఖర్చుపెట్టి భార్యకు ఉద్యోగం వచ్చేలా శ్రమించాడు. అంతా బాగానే ఉంది. తనను తన భార్య ఆదుకుంటుందని విశ్వాసంతో ఉన్న సిద్ధలింగప్పకు భార్య జ్యోతి అనుకోని విధంగా షాక్‌నిచ్చింది. సిద్ధలింగప్ప ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి కాళ్లు పోగొట్టుకుని దివ్యాంగుడిగా మారాడు.
తన ఉన్నతి కోసం కష్టపడిన భర్తను ఆదుకోవాల్సిన జ్యోతి తన దారి తాను చూసుకుంది. ఒంటరైన సిద్ధలింగప్ప సుమారు 10 ఏళ్ల నుంచి అవిటితనంతో బతుకు భారంగా వెళ్లదీస్తున్నాడు. ఎవరైనా పెద్దలు తన భార్యకు నచ్చజెప్పి తమనిద్దరినీ కాలపాలని వేడుకుంటున్నాడు. ఐటీఐ అర్హతతో జ్యోతి హుబ్లీ ఆర్టీసీ 3వ నెంబర్ డిపోలో సాంకేతిక సహాయకురాలిగా పని చేస్తున్నారు. మానవతావాదులు తనకు న్యాయం చేయాలని సిద్ధలింగప్ప మరిమరి వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment