
కత్తి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్న నిందితుడు మహంతేష్
సాక్షి, హుబ్లీ (కర్ణాటక): రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలిని హతమార్చిన అన్న పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. జిల్లాలోని నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన చెల్లెలు శశికళ సుణగార ఇటీవల పుట్టినింటికి వచ్చింది.
ఏదో విషయంపై మంగళవారం సాయంత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంతో మహంతేష్ తన చెల్లెలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శశికళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (కాటేసిన పాముతో ఆస్పత్రికి.. అది చూసి డాక్టర్లు షాక్)
Comments
Please login to add a commentAdd a comment