అదృశ్యమైన మేక.. ఎక్కడుందో తెలియక...
హుబ్లీ: మేకను పట్టండి.. పది వేల రూపాయలు పట్టుకెళ్లండి. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకోకండి. పశ్చిమబెంగాల్ లోని హవేరి జిల్లాలోని నెగలూర్ గ్రామస్థులు ఈ ప్రకటన చేశారు. దీంతో తప్పిపోయిన మేకకు పట్టుకునేందుకు గ్రామస్థులతో పాటు అందరూ గాలిస్తున్నారు. ఒక్క మేకకు పట్టుకునేందుకు పది వేలా అని ఆశ్చర్యపోకండి. దీని వెనుక చాలా కథ ఉంది.
ఇది గ్రామంలోని మసీదుకు చెందినది. 11 ఏళ్ల క్రితం కొందరు భక్తులు దీన్ని మసీదుకు కానుకగా ఇచ్చారు. దీంతో ఈ మేకపై గ్రామస్థులకు అవాజ్యమైన భక్తి ఏర్పడింది. అన్ని పండుగలు, మత కార్యక్రమాల్లోనూ ఇది ప్రధాన ఆకర్షణ నిలిచేది. కొద్ది రోజుల క్రితం ఈ మేక అదృశ్యమైంది. దీని ఆచూకీ చేసిన గ్రామస్థులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక చేసేది లేక భారీ నజారానా ప్రకటించారు. తమ అభిమాన మేకను తెచ్చిన వారికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు.
మేక ఆచూకీ కోసం పోస్టర్లు కూడా పెట్టారు. ఈ మేకతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని గ్రామస్థులు తెలిపారు. తామెంతో అభిమానంగా చూసుకునే మేక మాయమవడం తమను షాక్కు గురి చేసిందని అన్నారు. కావాలనే ఎవరో తమ మేకను ఎత్తుకు పోయారని వారు ఆరోపిస్తున్నారు. దయచేసి తమ మేకకు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మేక కోసం గ్రామస్థులు పడుతున్న తపన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.