
ప్రతీకాత్మక చిత్రం
హుబ్లీ/కర్ణాటక: హావేరి జిల్లా హానగల్ తాలూకా ఉపుఉనసి గ్రామంలో దుర్ఘటన చోటు చేసుకుంది. హరీశయ్య నాగయ్య హిరేమఠ అనే బాలుడిని చిత్రహింసలకు గురి చేసి కొత్త ఇంటి పునాదిలో వేయడానికి ప్రయత్నించారు. విషయం గమనించి కొందరు అడ్డుకొని, తీవ్రంగా గాయపడిన బాలుడిని హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
కానీ, చికిత్స ఫలించకపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఇంటి నిర్మాణం కోసం బాలుడిని బలి ఇవ్వడానికి ప్రయత్నించారని బంధువులు ఆరోపించారు. దీనిపై హరూరు పోలీస్ స్టేషన్‌లో బాలుడి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు నిందితులు శివరుద్ర హావేరి, బసన్నవ్వ ప్రభాకర్ కరిశెట్టర్, ప్రవీణ్ కరిశెట్టర, కుమార వీరభద్రప్ప హావేరిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: పుట్టిన రోజున.. పుట్టెడు దు:ఖం