మహిళను నమ్మించి నట్టేటా ముంచిన సైబర్‌ నేరగాళ్లు | Cyber Crime: Hubli Woman Loses One Lakh Fifty Thousand | Sakshi
Sakshi News home page

మహిళను నమ్మించి నట్టేటా ముంచిన సైబర్‌ నేరగాళ్లు

Published Thu, May 20 2021 8:54 AM | Last Updated on Thu, May 20 2021 9:01 AM

Cyber Crime: Hubli Woman Loses One Lakh Fifty Thousand - Sakshi

హుబ్లీ: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలో మరో మహిళ సైబర్‌ వంచకులు బారిన పడి రూ. లక్షన్నర పోగొట్టుకుంది. వివరాలు... ఇటీవల నగరంలోని యల్లపుర వీధికి చెందిన విజయలక్ష్మీ మొబైల్‌కు సిమ్‌బ్లాక్‌ అయినట్లు సందేశం వచ్చింది. దీనిని ఓపెన్‌ చేయాలంటే అందులో మొబైల్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సారాంశం ఉంది. దీంతో సదరు మహిళ ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయగా వివరాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వంచకులు తెలిపారు. ఆ మేరకు విజయలక్ష్మీ యాప్‌డౌన్‌లోడ్‌ చేసుకున్న క్షణాల్లోనే ఆమె ఖాతా నుంచి రూ.1.50 లక్షల నగదు నేరుగా వంచకుల ఖాతాలోకి వెళ్లిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement