
బీజేపీ నేత కుమార్తె ప్రేమ వివాహం.. బెదిరింపులు
సాక్షి, బెంగళూరు: కుటుంబ సభ్యుల నుంచి తమను కాపాడాలని ఓ ప్రేమజంట మంగళవారం జంటనగరాల పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. హుబ్లీ బీజేపీ కీలక నేత కుమార్తె మోనల్ కొరవి, రాహుల్ చందావరకరలు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అమ్మాయి తండ్రి బంధువులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని వారు కమిషనర్ లాబురామ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈనెల 2న గదగ్ జిల్లా ముండ్రగిలో రిజిష్టర్ వివాహం చేసుకొన్నామని, అమ్మాయి తండ్రి పలుకుబడి ఉన్నవారని, ఆయన కారణంగా తమకు ప్రాణభయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.