ఏ తల్లి కన్న బిడ్డో.. | People who were newborn baby left the hospital | Sakshi
Sakshi News home page

ఏ తల్లి కన్న బిడ్డో..

Published Tue, Aug 22 2017 8:44 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

ఏ తల్లి కన్న బిడ్డో..

ఏ తల్లి కన్న బిడ్డో..

కృష్ణరాజపురం(కర్ణాటక): ఏ తల్లి కన్నబిడ్డో పాపం, వెచ్చగా తల్లి ఒడిలో కేరింతలు కొట్టాల్సిన మగశిశువు అనాథలా రోడ్డు మీద పడి ఉంది. ఆ తల్లిదండ్రులకు ముద్దులొలికే బిడ్డే భారమయ్యాడో ఏమో మరి. ఎక్కడుంది మానవత్వం? అనిపించే అమానుష ఘటన నగరంలో జరిగింది.  అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు  కే.ఆర్‌.పురం ప్రభుత్వం ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన ఘటన సోమవారం వెలుగుచూసింది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగశిశువు కే.ఆర్‌.పురం ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లడంతో వర్షంలో తడుస్తూ ఎలుకలు కొరుకుతుండడంతో శిశువు ఏడుపు విన్న ఆసుపత్రి వాచ్‌మెన్‌ జోసెఫ్‌ శిశువును వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స ప్రారంభించారు.

ఆసుపత్రి పాలక మండలి సభ్యుడు చంద్రశేఖర్, ఆసుపత్రి అధికారి చంద్రశేఖర్‌లు శిశువును శిశువిహార్‌ సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. శిశువును రక్షించిన వాచ్‌మెన్‌ జోసెఫ్‌ను అభినందించారు. కాగా శుక్రవారం రాత్రి వాచ్‌మెన్‌ పోలీసులకు సమాచారం అందించగా శనివారం సాయంత్రం పోలీసులు ఆసుపత్రికి రావడంపై బుద్ధ భూమి ఫౌండేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కే.ఆర్‌.పురం ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలంటూ డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement