
మైసూరు: జిల్లాలోని గుండ్లుపేటె తాలకాలోని గరగనహళ్లిలో ఉన్న మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో కారం ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న సుమారు 7 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు... గురువారం ఉదయం విద్యార్థులకు టమాటా బాత్ టిఫిన్ పెట్టారు. అది ఎక్కువగా కారం ఉండటంతో ఏడుమంది విద్యార్థులు కడుపునొప్పి, మంట, వాంతులతో బాధపడసాగారు.
బాధిత విద్యార్థులు వర్ణిత (13), హర్షిత (13), ప్రియ (13), రచన (15), సంజన (15), సంగీత (13), ప్రజ్వల్ (15)లను హోరెయాల ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. ఇందులో ప్రజ్వల్‌కు కడుపునొప్పి ఎక్కువగా ఉండడంతో అతన్ని బేగరు ఆస్పత్రికి తరలించారు. వంట సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు ఆరోపించారు.