'చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. అందరికీ తెలిసిన చిట్కా వ్యాజలైన్ రాయడంతో పాటు ఈ కాలంలోనూ ముఖం తేటగా, ఆరోగ్యంగా ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాలివి..'
- చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా.. మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- ఈకాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం.. స్మాగ్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
- తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది.
- రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రతో ముఖం తేటబారుతుంది.
ఆహార పరంగా..
- అన్ని రకాల పోషకాలు అందే సమతులాహారాన్ని రోజూ తీసుకోవాలి. అయితే చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది సరికాదు. రోజూ తప్పనిసరిగా మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.
- ఆకుకూరలు, కూరగాయలూ, ములగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తేటగా కనిపించేలా చేస్తాయి.
- డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
ఇవి చదవండి: గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment