రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(69) ఆరోగ్యం గురించి పాశ్చాత్య మీడియా చేస్తున్న ప్రచారం గురించి తెలిసిందే. పార్కిన్‌సన్ లేదంటే క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారంటూ వరుస కథనాలతో ఊదర గొడుతోంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించి.. ఆపరేషన్ అవసరమని, తద్వారా ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో అధికారం మరొకరికి అప్పగిస్తారంటూ వార్తలు ప్రచురించాయి.
అయితే వీటిలో దేనికి క్రెమ్లిన్ వర్గాలు స్పందించలేదు. ఈ తరుణంలో రష్యా టెలిగ్రామ్ చానెల్ జనరల్ ఎస్వీఆర్ సైతం ఈ వార్తల్ని ప్రచురించడంతో.. ఆ కథనాలు నిజమనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా యూకేకు చెందిన ఇండిపెండెంట్ మరో కథనం ప్రచురించింది. విక్టరీ డే సందర్భంగా.. మాస్కో రెడ్ స్క్వేర్ వద్ద నిర్వహిస్తున్న మిలిటరీ పరేడ్‌లో పుతిన్ దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆయన అనారోగ్యంపై మరిన్ని సందేహాలు రేకెత్తించేలా.. మందంగా ఉన్న దుప్పటితో కాళ్లను కప్పుకుని దర్శనమిచ్చారు. అంతేకాదు, పుతిన్ దగ్గుతూ కనిపించాడని, అక్కడున్న వారందరిలో చలి నుంచి కాపాడుకోవడానికి అదనపు దుస్తులు ధరించింది పుతిన్ ఒక్కడేనని ఇండిపెండెంట్ పేర్కొంది.
తొమ్మిది డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్.. అందులో తనకంటే వయసు పైబడిన వాళ్లు ఉన్నా కూడా పుతిన్ ఒక్కడే అలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల ఓ సమావేశంలో టేబుల్ ను గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. సమావేశం జరిగినంత సేపు పుతిన్ టేబుల్ ను పట్టుకుని.. వణికిపోతుండడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు బలపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment