
సాక్షి, హైదరాబాద్: విప్లవ కవి పి.వరవరరావు ముంబైలోని తలోజ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని ఆయన కుటుంబసభ్యులతో పాటు హక్కుల కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. మహా రాష్ట్ర– ముంబై–తలోజ జైలులో విచా రణ ఖైదీగా ఉన్న వరవరరావుతో జైలు అధి కారులు తనతో ఫోన్లో మాట్లా డించారని, వీవీ మాట్లాడిన తీరు పొంతన లేకుండా ఉందని, మాట మొద్దు బారిపోయిం దని ఆయన సహచరి హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. వీవీ ఆరోగ్యం బాగా చెడిపోయిందని ఆయన పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ తీసుకుని తనతో చెప్పాడని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వరవర రావును ఆస్పత్రికి పంపించి చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు. వీవీ బెయిల్‌పై విడుదలై, తన కుటుం బంతో కలసి ఉండి, సరైన చికిత్స పొందేవిధంగా సీఎం కేసీఆర్ తగిన సహకారం అందిం చాలని విజ్ఞప్తి చేశారు. వీవీకి తక్షణమే వైద్య సదు పాయం అందేలా చర్యలు తీసుకోవా లని చాలామంది కవులు, సాహితీ వేత్తలు సామాజిక మార్గాల్లో సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment