ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్‌ నటి | Saira Banu Discharged From Hospital And Doing Well | Sakshi
Sakshi News home page

Saira Banu: ఆస్పత్రి నుంచి బాలీవుడ్‌ నటి డిశ్చార్జ్‌.. నిలకడగా ఆరోగ్యం..

Published Mon, Sep 6 2021 1:55 PM | Last Updated on Mon, Sep 6 2021 2:23 PM

Saira Banu Discharged From Hospital And Doing Well - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి, వెటరన్‌ యాక్టర్‌ సైరా బాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఫైజల్‌ ఫారూఖీ అతని ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ఆమె అభిమానులతో పంచుకున్నాడు. కాగా 77 ఏళ్ల నటి సైరా బాను ఊపిరి అందక ఆగస్టు 28న ముంబైలోని హిందుజ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉండడంతో ఆమెను ఐసీయూలోకి మార్చారు.

ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ మీడియా ఏజెన్సీకి తెలిపాయి. ఫారుఖీ ఈ విషయం గురించి తెలుపుతూ.. "సైరా బానుజీ ఇంటికి వచ్చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. మీ ప్రేమ, ప్రార్థన వల్లే ఆమె కోలుకున్నారు" అని నటి అభిమానులను ఉద్దేశించి ఫైజల్‌ ఫారూఖీ పోస్ట్‌లో హ​ర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు సైరా బాను గుండె జబ్బుతో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు, నిర్ధారణ తర్వాత కరోనరీ ఆంజియోగ్రామ్ చేయించుకోమని సూచించగా నటి  నిరాకరించినట్లు ఆసుపత్రి వైద్యుడు ఒకరు మీడియా ఏజెన్సీకి తెలిపాడు.

సైరాబాను భర్త, బాలీవుడ్‌ స్టార్‌ దీలిప్‌ కుమార్‌ 98 ఏళ్ల వయసులో మరణించిన విషయం అందరికి తెలిసిందే.  ఆయన కూడా ఊపిరి అందక అదే హిందుజా హిస్పిటల్‌లో చేరి, అనంతరం జూలై 7న తుదిశ్వాస విడిచారు. ఈ రియల్‌ లైఫ్‌ కపుల్‌ సగిన, గోపి, బైరాగ్‌, దునియా వంటి హిట్‌ సినిమాల్లో కలిసి నటించారు.  కాగా, ఆమె దివంగత బాలీవుడ్‌ నటుడు షామ్మీ కపూర్‌ హీరోగా నటించిన జంగ్లీ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. అనంతరం ఆమె పదోసన్‌, హేరా పేరి, దివానా వంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 1988లో ఫైస్లాలో నటించారు.

చదవండి: Kim Sharma- Leander Paes: టెన్నిస్‌ స్టార్‌తో రిలేషన్‌.. కన్‌ఫర్మ్‌ చేసిన కిమ్‌ శర్మ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement