కొంతకాలంగా బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టుగా ప్రకటించిన దగ్గర నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్ స్వయంగా ట్వీట్ చేసినా, ఆయన భార్య మీడియా ద్వారా స్పందించినా రూమార్స్ మాత్రం ఆగలేదు.
తాజాగా ఇర్ఫాన్ ఖాన్ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు సూజిత్ సర్కార్.. ఇర్ఫాన్ ఆర్యోగ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రస్తుతం ఇర్ఫాన్ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన ఉద్ధమ్ సింగ్ బయోపిక్‌లో నటిస్తారు’ అంటూ రూమర్స్‌కు చెక్ పెట్టారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని ప్రతీకారంగా పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను మట్టుపెట్టిన స్వతంత్ర్య సమరయోధుడు ఉద్ధమ్ సింగ్. సూజిత్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కథలో ముందుగా రణబీర్ కపూర్ నటిస్తాడన్న వార్తలు వినిపించినా.. సూజిత్.. ఇర్ఫాన్ ఖాన్ ఉద్ధమ్ పాత్రలో నటించనున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment