Samantha Manager Gives Clarity On Her Health Issues - Sakshi
Sakshi News home page

Samantha: సమంతకు చర్మ సంబంధిత సమస్య.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్‌

Published Tue, Sep 6 2022 1:09 PM | Last Updated on Tue, Sep 6 2022 1:26 PM

Samantha Manager Gives Clarity On Her Health Issues - Sakshi

గత కొంత కాలంగా సమంత పేరు నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్‌ లైఫ్‌తో పాటు నటించిన సాంగ్స్,  కనిపించే యాడ్స్ .. ఇలా ఏదో ఒకరకంగా సామ్‌ నేమ్‌ ట్రెండింగ్‌ అవుతూనే ఉంది.

అయితే సామ్‌ మాత్రం ఇవన్ని లైట్‌ తీసుకుంది. తనపై వచ్చే  పుకార్లకు స్పందించడం లేదు. అంతేకాదు సోషల్‌ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది.  కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ బిగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంత కాలంగా సామ్‌ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, అందుకే ఆమె బయటకు రావడం లేదనేది ఆ వార్త సారాంశం.
(చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే)

దీనిపై తాజాగా సమంత పర్సనల్‌ మేనేజర్‌ స్పందించాడు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సమంతకు ఎలాంటి  ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశాడు. కొంతమంది కావాలనే తప్పులు వార్తలు సృష్టిస్తున్నారని, వారిపై సమంత లీగల్‌ యాక్షన్‌ తీసుకునే చాన్స్‌ ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఈ నెలాఖరులో షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని చెప్పారు. 

ఇక సామ్‌ సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన యశోద, శాకుంతలం చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఓ హిందీ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. విజయ్‌ దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement