జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మూవీ హిట్‌తో ఆయన రాత్రికి రాత్రే పాపులర్ అయ్యాడు. తాజాగా ప్రిన్స్ సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక అనుదీప్ ఏ ఇంటర్య్వూ ఇచ్చి అది సోషల్ మీడియా వైరల్ కావాల్సిందే. అందులో ఆయన వేసే సరదా పంచ్‌లకు, కామెడీకి ప్రేక్షకులు కడుబ్బా నవ్వాల్సిందే. అలా తనకంటూ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న అనుదీప్ ఓ ఇంటర్య్వూలో షాకింగ్ విషయం బయట పెట్టాడు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన.. తాను అరుదైన వ్యాధి బాధపడుతున్నట్లు చెప్పాడు.
చదవండి: ‘కాంతార’కి ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ హీరో: అసలు విషయం చెప్పిన రిషబ్ శెట్టి
తను హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్‌ఎస్‌పీ) అనే డిజార్డర్ ఉందని తెలిపాడు. ఈ మేరకు అనుదీప్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరిలో ఈ డిజార్డర్ లక్షణాలు కామన్‌గా ఉంటాయి. కానీ అర్ధం చేసుకోలేరు. నా శరీరంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల వల్ల నాలో ఈ వ్యాధిని గుర్తించాను. నాకు గ్లూటెన్ పడదు. కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదు. ఏదైనా పళ్ల రసం తాగితే మెదడు పనితీరు ఆగిపోతుంది. మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. ఏం చేస్తున్నానో అర్థం కాదు. అయితే ఈ డిజార్డర్ ఉన్న వారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?
కానీ ఈ వ్యాధి ఉన్నవారు చాలా తొందరగా అలసిపోతారని తెలిపాడు. అనంతరం ‘తాను ఎక్కువ కాంతివంతమైన లైట్స్, ఘాటైన వాసనలు చూసినా వాటి తీవ్రతను తట్టుకోలేను. చాలా ఇబ్బంది పడతా. దీని గురించి శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. ఈ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక ఈ వ్యాధి లక్షణాలు ఉన్నావారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి పరిశోధించి అవే పాటిస్తున్నాను’ అన్నాడు. ఇక తనకు ఉన్న ఈ వ్యాధిపై భవిష్యత్తులో సినిమా తీస్తానని, దాని వల్ల కొందరై హీల్ అవతారని ఆశిస్తున్నానంటూ అనుదీప్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment