![Director Anudeep KV About Prince Movie Response - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/24/kv.jpg.webp?itok=15CVw9Ny)
‘‘ప్రిన్స్’ చిత్రానికి తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. అన్నివర్గాల ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని దర్శకుడు అనుదీప్ కేవీ అన్నారు. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ‘ప్రిన్స్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్‌మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా అనుదీప్ కేవీ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచనే ‘ప్రిన్స్’ కథకు స్ఫూర్తి. ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేయమని సురేష్ బాబు, సునీల్, రామ్‌మోహన్‌గార్లు స్వేచ్ఛ ఇచ్చారు. నేను కామెడీ సినిమాలు చేసేందుకు చార్లీ చాప్లీన్, జంధ్యాల, రాజ్ కుమార్ సంతోషి వంటి వారు స్ఫూర్తి.
బాలచందర్‌గారి సినిమాలు అంటే ఇష్టం.. ఆయన తరహాలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేయాలని ఉంది. హారిక హాసినీ, మైత్రీ మూవీ మేకర్స్‌లో నా తర్వాతి సినిమాలు ఉంటాయి. హీరో రామ్‌గారికి ఓ కథ చెప్పాలి’’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment