
Bappi Lahiri Rubbishes Rumours About His Health: తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ప్రముఖ సింగర్, కంపోజర్ బప్పీ లహరి స్పందించారు.
Bappi Lahiri Rubbishes Rumours About His Health: ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ బప్పీ లహరి తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. నా ఆరోగ్యం గురించి కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఫేక్ న్యూస్‌లు సర్య్కులేట్ చేయడం బాధగా అనిపిస్తుంది. నా శ్రేయోభిలాషులు, అభిమానుల ఆశీస్సుల వల్ల నేను బాగానే ఉన్నాను. అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు.
కాగా బప్పీ లహరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ సోకడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల అనంతరం ఆయన కోలుకున్నారు. అయితే కరోనా కారణంగా ఆయన గొంతు పూర్తిగా దెబ్బతిందని పలు వార్తలు నెట్టింట షికార్లు చేశాయి.
తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని బప్పీ లహరి స్పష్టం చేశారు. దీంతో ఈ పుకార్లకి ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది. కాగా 1970-80ల కాలంలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబీ వంటి సినిమాలకు బప్పీ లహరి పాడిన పాటలు అప్పట్లో ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరగా ఆయన బాఘీ3 చిత్రంలో భంకాస్ అనే పాటను పాడారు.