
జబర్దస్త్ కమెడియన్ ‘పంచ్’ ప్రసాద్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పంచ్ ప్రసాద్‌కు సాయం చేసేందుకు తన తోటి కంటెస్టెంట్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ‘కిరాక్’ ఆర్పీ పంచ్ ప్రసాద్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్వల్పంగా కోలుకున్న పంచ్ ప్రసాద్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్బంగా తన ఆరోగ్యంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటారా? స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
తనకు సాయం చేసేందుకు చాలా మంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారని, వారందరికీ రుణపడి ఉంటానన్నాడు. ‘పెళ్లయిన కొత్తలో నా ముక్కులో నుంచి తరచూ రక్తం రావడంతో నా భార్య ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పడే నా రెండు కిడ్నిలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. కిడ్ని సమస్యలు ఉన్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. నా కాలు ఎముకకు చీము రావడంతో నడవలేని స్థితికి వెళ్లిపోయా. ప్రస్తుతానికి స్వల్పంగా కోలుకున్నా. షోలు కూడా చేసుకుంటున్నా. ఇప్పుడు బాగానే నడుస్తున్నాను. త్వరలోనే ఆపరేషన్ కూడా చేయించుకోబోతున్నా’ అని చెప్పాడు.
చదవండి: అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర సంఘటన, స్టేజ్‌పైనే చరణ్‌కు క్షమాపణలు చెప్పిన నటి
అయితే తన కాలుకు చీము రావడం వల్లే ఆపరేషన్‌ని వాయిదా వేశారని తెలిపాడు. ఇప్పటికే తనకి కిడ్నీ డోనర్ దొరికారని, కాలు నొప్పి తగ్గే వరకు డాక్టర్లు ఆపరేషన్ చేయమని చెప్పారని పంచ్ ప్రసాద్ పేర్కొన్నాడు. అయితే తాను త్వరగా కోలుకోవాలని చాలా మంది తన కోసం ప్రార్థించారని, ఓ అభిమాని అయితే కుటుంబంతో సహా తిరుపతి వెళ్లి కాళి నడకన ఏడుకొండలు ఎక్కాడంటూ పంచ్ ప్రసాద్ ఆసక్తిక విషయం చెప్పాడు. అప్పుడే తనని ఇంతలా అభిమానించే అభిమానులు ఉన్నారా? అని ఆశ్చర్యం వేసిందన్నాడు. అనంతరం తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడిని అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment