నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె | Kaikala Satyanarayana Is Recovering Says His Daughter Kaikala Rama Devi | Sakshi

నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె

Nov 23 2021 10:43 PM | Updated on Nov 23 2021 10:45 PM

Kaikala Satyanarayana Is Recovering Says His Daughter Kaikala Rama Devi - Sakshi

ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సత్యనారాయణ ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో వదంతులు ప్రచారమయ్యాయి. దీంతో ఆయన కుమార్తె కైకాల రమాదేవి ఈ విషయంపై మంగళవారం ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ‘‘సత్యనారాయణగారి పరిస్థితి బాగానే ఉంది. నాన్నగారు కోలుకుంటున్నారు. బాగానే స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న (సోమవారం) డాక్టర్‌ మాదాల రవిగారు కూడా వచ్చారు. ఆయనతో నాన్నగారు మాట్లాడి థంబ్స్‌ అప్‌ కూడా చూపించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారం ఇచ్చి ఎవర్నీ ఆందోళనకి గురిచేయొద్దు’’ అన్నారు రమాదేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement