recovering in hospital
-
నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె
ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సత్యనారాయణ ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో వదంతులు ప్రచారమయ్యాయి. దీంతో ఆయన కుమార్తె కైకాల రమాదేవి ఈ విషయంపై మంగళవారం ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ‘‘సత్యనారాయణగారి పరిస్థితి బాగానే ఉంది. నాన్నగారు కోలుకుంటున్నారు. బాగానే స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న (సోమవారం) డాక్టర్ మాదాల రవిగారు కూడా వచ్చారు. ఆయనతో నాన్నగారు మాట్లాడి థంబ్స్ అప్ కూడా చూపించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారం ఇచ్చి ఎవర్నీ ఆందోళనకి గురిచేయొద్దు’’ అన్నారు రమాదేవి. -
నెల్లూరులో కొలుకున్న కరోనా సోకిన వ్యక్తి
-
ఆ దుండగులు దొరికారు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగురోజుల క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగమ్మాయి లావణ్య చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి చెందిన లావణ్య (26) చెన్నై నావలూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఈనెల 13న తెల్లవారుజామున విధులు ముగించుకుని నుంగంపాళయంలోని సోదరి ఇంటికి బైక్‌పై బయలుదేరారు. అరసన్‌కళని రోడ్డులో వెళుతుండగా దారిదోపిడీ ముఠా ఆమె తలపై ఇనుపరాడ్‌తో మోదడంతో కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె తల రోడ్డుపై ఉన్న ఒక బండరాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయారు. దుండగలు ఆమె మెడలోని నగలు, డబ్బు, సెల్‌ఫోన్, బైక్ దోచుకెళ్లారు. స్పృహలేని స్థితిలో పడిఉన్న లావణ్యను కొందరు స్థానికులు గుర్తించి పల్లికరణై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమెను ప్రయివేటు ఆస్పత్రి చేర్పించి విచారణ చేపట్టారు. ఈనెల 14న సెంమ్మంజేరీలోని ఒక మద్యం దుకాణం ముందు లావణ్య బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెమ్మంజేరీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు మద్యం తాగేందుకు వచ్చి మోపెడ్ అక్కడే వదిలివెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించగా ప్రధాన నిందితుడు సూర్య సహా నలుగురు పట్టుబడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య బుధవారం సాయంత్రం స్పృహలోకి వచ్చింది. అయితే ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీస్ సహాయ కమిషనర్ ముత్తుస్వామి గురువారం సాయంత్రం మరోసారి లావణ్యను కలుసుకోగా తనను కాపాడినందుకు కృతజ్ఞతలు అన్నట్లుగా తన రెండుచేతులూ జోడించి పోలీసులకు నమస్కరించింది. సంఘటన జరిగిన రోజున ఐదు కిలోమీటర్లు తనను వెంబడించి దాడిచేసిన నిందితులను గుర్తుపట్టే ఆనవాళ్లను పోలీసులకు వివరించినట్లు సమాచారం. తలపై శస్త్రచికిత్స చేసినందున ఎక్కువసేపు మాట్లాడరాదని వైద్యులు అభ్యంతరం చెప్పపడంతో పోలీసుల తిరిగి వెళ్లిపోయారని సమాచారం. -
కుదుటపడిన ఇళయరాజా ఆరోగ్యం
సంగీత ప్రపంచ రారాజు ఇళయరాజా ఆరోగ్యం కుదుటపడిందని ఆయన మేనల్లుడు, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇళయరాజాకు స్వల్పంగా గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. 70 ఏళ్ల ఇళయరాజాకు గుండెలో కొద్దిగా నొప్పి అనిపించడంతో వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అంతా బాగానే ఉందని చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ''మా మామయ్య, ఇసైజ్ఞాని ఇళయారాజా బాగున్నారు. ఆయన కోసం ప్రార్థనలు చేసినవారికి, ప్రేమను అందించిన వారికి అందరికీ కృతజ్ఞతలు'' అని వెంకట్ ప్రభు తన ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఇళయరాజాను త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. పలు భాషల్లో ఇళయరాజా ఇప్పటికి 900కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా తలైమురైగల్ చిత్రంలో ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల మదిని దోచుకుంది. దళపతి, క్షత్రియపుత్రుడు, దేవరాగం, నాయకుడు.. ఇలా అనేక చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. త్వరలో ఆయన మలేసియాలో లైవ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. My uncle!! our isaignani!! Is absolutely fine!! Thanks for the love and prayers!! — venkat prabhu (@dirvenkatprabhu) December 23, 2013