
Kaikala Satyanarayana Health: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడానని, తన మాటలకు కైకాల ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ మేరకు కైకాల ఆరోగ్యం పై చిరంజీవి ఓ ట్వీట్ చేశాడు.
‘ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, ‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి’అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చిరంజీవి పేర్కొన్నారు.
#GetWellSoonKaikalaGaru #KaikalaSatyanarayana#NavaRasaNatanaSarvabhouma pic.twitter.com/Log3ohKtnz
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 21, 2021
Comments
Please login to add a commentAdd a comment