శుక్రవారం మరణించిన టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ మృతదేహానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణతో పాటు దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, జగపతిబాబు, సంగీత దర్శకుడు కోటి లాంటి వారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 100కు పైగా చిత్రాలను తెరకెక్కించినా కోడి రామకృష్ణలో ఏనాడు గర్వం చూడలేదన‍్నారు రాఘవేంద్ర రావు. దాసరి గారి తరువాత అత్యథిక చిత్రాలకు డైరెక్ట్ చేసిన దర్శకుల జాబితాలో కోడి రామకృష్ణ ముందుంటారని, గురువు బాటలోనే ఆయన కూడా ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment