
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. భార్య సురేఖతో కలిసి కైకాల ఇంటికి వెళ్లిన చిరంజీవి ఆయనకు నేరుగా విషెస్ తెలియజేసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్య నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను, నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. చిరంజీవి, కైకాల సత్యనారాయణ కాంబినేషన్‌లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, బావగారు బాగున్నారా వంటివి వీరి సినిమాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే.
తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి.Happy Birthday #KaikalaSatyanarayana garu! pic.twitter.com/NTm8RCf0LE
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2021