
విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్. టాప్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు రివీల్ చేస్తూ చిత్రబృందం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక పాత్రలకు పలువురిని ఫైనల్ చేసిన చిత్ర బృందం.. తాజాగా మరో కీలక పాత్రకు సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్రంలో దర్శకుడు హెచ్‌ఎమ్ రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ నటించినట్లు దర్శకుడు క్రిష్ స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నాడు. నేడు(జులై25) కైకాల సత్యనారాయణ జన్మదిన సందర్బంగా క్రిష్ శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకోంటోంది.
‘కాళిదాస, భక్త ప్రహ్లాద చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకు పునాది వేసిన పితామహుడు టైగర్ హెచ్ ఎమ్ రెడ్డి పాత్రలో నటించిన నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో ఆయన భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్‌లు కనిపించనున్నారు.
టైగర్ H.M Reddy గారి పాత్రలో నటించిన నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు #NTR pic.twitter.com/5aiK0gcKla
— Krish Jagarlamudi (@DirKrish) July 25, 2018
Comments
Please login to add a commentAdd a comment