
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారాయన.
నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తింపుగా ‘నవరస నటనా సార్వభౌమ’ అనే బిరుదు పొందారు కైకాల. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల మరణ వార్తతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు.
- కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో1935 జులై 25న జన్మించిన కైకాల సత్యనారాయణ
- గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైయ్యారు
- 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది
- కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు
- నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల.. 777 చిత్రాల్లో నటన
- కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు
- కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం: మహర్షి