
భాస్కర్ సీఐ, కందుకూరు
కందుకూరు రంగారెడ్డి : సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దని సీఐ భాస్కర్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగ్ వచ్చిందని, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలు నిద్ర పోకుండా జాగారం చేస్తున్నారని ప్రచారం జరుగుతుందన్నారు. అవన్నీ అసత్య వార్తలని, అలాంటి సంఘటనలో ఎక్కడా చోటు చేసుకోలేదన్నారు.
అనవసరంగా ప్రజలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. వధంతులను నమ్మొద్దన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసే ముందు ఒక్కటికి పదిసార్లు ఆలోచించాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి వడిగట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment