
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పొత్తికడుపు క్యాన్సర్ తొలి దశలో ఉందని ఇంటర్‌నెట్‌లో వార్తలు వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు అవి కేవలం వదంతులేనని తోసిపుచ్చారు. తాజాగా తనకు స్టమక్ క్యాన్సర్ సోకిందనే వార్తలు కేవలం వదంతులేనని స్వయంగా షాహిద్ కపూర్ మంగళవారం ట్వీట్ చేశారు. వదంతులను నమ్మవద్దని తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అభిమానులకు భరోసా ఇచ్చారు.
అంతకుముందు షాహిద్ కుటుంబ సభ్యులు కూడా ఇవి కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. అసలు వారిష్టం వచ్చిన రీతిలో కొందరు ఎందుకిలా రాస్తారు..? ఏ ఆధారంగా ఇలా రాశారు..ఇలాంటి వదంతులు వ్యాపింపచేయడం ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు.
ఇక వృత్తిపరంగా శ్రద్ధాకపూర్‌తో కలిసి బట్టి గుల్ మీటర్ చాలులో నటించిన షాహిద్ ప్రస్తుతం అర్జున్‌రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ సెట్‌లో ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ షాహిద్ హల్‌చల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 21న కబీర్ సింగ్ థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment