
షాహిద్ కపూర్
కొన్ని పుకార్లకు తలా తోకా ఉండదు. ఎక్కడ నుంచి పుడతాయో కూడా తెలియదు. తాజాగా ముంబైలో ఓ పుకారు షాహిద్ కపూర్ పొట్టలోనుంచి పుట్టింది. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పొట్ట సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్నారు అన్నది ఆ వార్త సారాంశం. కానీ అందులో ఎటువంటి నిజం లేదంటున్నారు షాహిద్. ‘‘నేను బాగానే ఉన్నాను. అనవసరమైన పుకార్లను నమ్మకండి’’ అంటూ ట్వీట్ చేసి ఫ్యాన్స్‌కున్న డౌట్‌ని క్లియర్ చేశారు. ఈ వార్త గురించి షాహిద్ కుటుంబ సభ్యులు ముంబై మీడియాతో మాట్లాడుతూ – ‘‘ఏ సంఘటన ఆధారంగా ఇలాంటి కథనాలు అల్లుతారు? ఇలాంటి నిజంలేని వార్తలను ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం షాహిద్ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment