
ఎన్టీఆర్ సినిమాపై కళ్యాణ్ రామ్ క్లారిటీ
జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు నటవిశ్వరూపం అనే టైటిల్ను నిర్ణయించారని, అదే సమయంలో హీరోయిన్లుగా కాజల్, అనుపమా పరమేశ్వరన్, నివేదా థామస్ లను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ వార్తలను చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ కొట్టిపారేశాడు. ఎన్టీఆర్ హీరోగా తమ బ్యానర్లో తెరకెక్కబోయే సినిమాపై రకాల రకాల రూమర్స్ వినిపిస్తున్నాయన్న కళ్యాణ్ రామ్ అవన్నీ నిరాధారమైనవి అన్నాడు. ఇప్పటి వరకు సినిమా టైటిల్, కాస్టింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. నటీనటులు, టైటిల్ ఫైనల్ అయిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని తెలిపాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సినిమాపై వస్తున్న రూమర్స్కు తెరదించాడు.
Lots of rumours circulating about the title as well as cast and crew of #NTR27. None of them are true.If it's official,it'll come from us.
— NTR Arts (@NTRArtsOfficial) 26 December 2016