కన్ఫామ్ : ఎన్టీఆర్ 27 టైటిల్ అదే..! | Jai Lavakusa Title Confirmer for Ntr Movie | Sakshi
Sakshi News home page

కన్ఫామ్ : ఎన్టీఆర్ 27 టైటిల్ అదే..!

Published Sat, Mar 18 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

కన్ఫామ్ : ఎన్టీఆర్ 27 టైటిల్ అదే..!

కన్ఫామ్ : ఎన్టీఆర్ 27 టైటిల్ అదే..!

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో జూనియర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రారంభానికి ముందు నుంచే ఈ సినిమాకు జై లవకుశ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 27వ చిత్రానికి జై లవకుశ అనే టైటిల్నే ఫిక్స్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో భాగంగా ఉపయోగిస్తున్న క్లాప్ బోర్డ్పై ఇదే టైటిల్ ఉందని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ 27కు జై లవకుశ అనే టైటిల్ను కన్ఫామ్ చేసినట్టే అని భావిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement