Jai Lavakusa
-
జై లవకుశ దసరా స్పెషల్
-
మేకింగ్ ఆఫ్ మూవీ - జై లవకుశ
-
అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..
తిరుపతి: నందమూరి అభిమానులు తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం విడుదల సందర్భంగా పేద విద్యార్థి చదువుకునేందుకు ఆర్థిక సాయం అందించారు. తిరుపతికి చెందిన పి. మోహిత్ అనే విద్యార్థికి 9వ తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లుగా నందమూరి ఫ్యాన్స్ డాట్ కాం ద్వారా ఆర్థిక సాయం అందించి చదివిస్తున్నామని తెలిపారు. ‘తుడా’ చైర్మన్ జి. నరసింహ యాదవ్ చేతుల మీదుగా ఆ విద్యార్థికి ఫీజు నిమిత్తం రూ. 17వేల ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ అభిమానులు పి. మనోహర్‌రెడ్డి, కేపీ. చౌదరి మాట్లాడుతూ.. గతంలో చిత్రం విడుదల సమయంలో ఫ్లెక్సీలు కట్టి, బాణ సంచాలు కాల్చి సంబరాలు జరుపుకునే వారమని చెప్పారు. ఈ సంబరాల కన్నా పేద విద్యార్థులను చదివించేందుకు తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కారక్రమంలో పలువురు నందమూరి అభిమానులు పాల్గొన్నారు. -
రావణుడిగా ఎన్టీఆర్.. జై లవకుశ ఫస్ట్ లుక్
-
రావణుడిగా ఎన్టీఆర్.. జై లవకుశ ఫస్ట్ లుక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలోనటిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం, ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండటం లాంటి అంశాలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. ఉగాది కానుకగా సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ లుక్ ను రివీల్ చేశారు. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ ను రివీల్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో పది తలల రావణుడ్ని హైలెట్ చేస్తు కారు దిగుతున్న స్టైలిష్ ఎన్టీఆర్ లుక్ సూపర్బ్ గా ఉంది. మరో పోస్టర్ లో చేతికి ఇనుప సంకెళ్లతో దండం పెడుతున్న స్టిల్ ను రిలీజ్ చేసిన యూనిట్, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేసింది. Roudhram... Rajasam... kalagalipithe maa ee Ravanudu.. Here is Jai #JaiLavaKusaFirstLook pic.twitter.com/tek3wLl5uv — Mahesh S Koneru (@smkoneru) 19 May 2017 -
ఎన్టీఆర్ క్యారెక్టర్‌పై క్లారిటీ
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జై లవకుశ. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల ఫేం బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర కాగా, మరో క్యారెక్టర్లో జూనియర్ ప్రభుత్వోద్యోగిగా కనిపించనున్నాడట. ఇక మూడో పాత్రలో ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్సర్‌గా కనిపించనున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఈ రూమర్స్‌పై స్పందించిన చిత్రయూనిట్ ఎన్టీఆర్ పాత్రలపై క్లారిటీ ఇచ్చింది. జూనియర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న విషయం నిజమై అయినా ఇతర రెండు పాత్రలపై ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ నిజం కాదని తేల్చి చెప్పింది. దీంతో ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూడలనుకున్న అభిమానులు నిరాశపడుతున్నారు. అయితే మే 19న జై లవకుశ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలాంటి క్యారెక్టర్లలో కనిపించనున్నాడో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఎన్టీఆర్‌తో మరోసారి..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఒకసారి పనిచేసిన దర్శకులు మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటారు. గతంలో వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్‌తో రెండు మూడు సినిమాలకు పనిచేశారు. అయితే తాజాగా ఈ లిస్ట్ మరో దర్శకుడు చేరబోతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో బిగెస్ట్ హిట్‌గా నిలిచిన జనతా గ్యారేజ్ సినిమాను డైరెక్ట్ చేసిన కొరటాల శివ, మరోసారి జూనియర్‌ను డైరెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. కొరటాల కూడా భరత్ అను నేను స్క్రిప్ట్ రెడీ చేసుకొని మహేష్ బాబు డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత మరోసారి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. -
కన్ఫామ్ : ఎన్టీఆర్ 27 టైటిల్ అదే..!
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో జూనియర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రారంభానికి ముందు నుంచే ఈ సినిమాకు జై లవకుశ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 27వ చిత్రానికి జై లవకుశ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో భాగంగా ఉపయోగిస్తున్న క్లాప్ బోర్డ్‌పై ఇదే టైటిల్ ఉందని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ 27కు జై లవకుశ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్టే అని భావిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాశీ ఖన్నాకు క్రేజీ ఛాన్స్
సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోతున్న యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా. తనతో పాటు ఇండస్ట్రీకి పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్, టాప్ హీరోలతో సినిమాలు చేస్తుంటే.. రాశీ మాత్రం మీడియం రేంజ్ స్టార్లతోనే సరిపెట్టుకుంటోంది. ఒకటి రెండు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవటంతో కెరీర్‌ను మలుపు తిప్పే ఓ క్రేజీ ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది. ఆ చాన్స్ ఇన్నాళ్లకు రాశీ ఖన్నా తలుపు తట్టింది. ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న రాశీఖన్నా త్వరలో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఓ యంగ్ హీరో సరసన నటించనుంది. జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటించనుంది. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవకుశ' సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అలరించనున్నారు. రాశీఖన్నాను ఒక హీరోయిన్గా ఫైనల్ చేయగా మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయాల్సి ఉంది. -
ఫిబ్రవరి 11న ఎన్టీఆర్ 'జై లవకుశ'
-
11నుంచి ఎన్టీఆర్ 27?
‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిన్న ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్న కొత్త చిత్రానికి ఫిబ్రవరి 11న కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కొంచెం విరామం తీసుకున్నారు. తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో చేస్తారనే దానిపై పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరపాలనుకుంటున్నారట. ఆగస్టులో సినిమా విడుదల చే సేలా యూనిట్ భావిస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్‌ని పెట్టనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘జై లవకుశ’ నమోదు చేయించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు భోగట్టా. అన్నట్లు.. ఇది ఎన్టీఆర్‌కి 27వ సినిమా. -
ఫిబ్రవరి 11న ఎన్టీఆర్ 'జై లవకుశ'
జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త సినిమా ఫిబ్రవరి 11న ప్రారంభమవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాను పవర్, సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాల దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఇటీవల కళ్యాణ్ రామ్ జై లవకుశ అనే పేరు రిజిస్టర్ చేయించటంతో ఎన్టీఆర్ సినిమా టైటిల్ అదే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే టైటిల్ కు సంబంధించి యూనిట్ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఆరునెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 11న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ కోసం ఇంట్రస్టింగ్ టైటిల్..?
జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన జూనియర్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పవర్ ఫేం బాబీ దర్శకుడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిలిం చాంబర్లో 'జై లవకుశ' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. ఈ టైటిల్ ఎన్టీఆర్ సినిమా కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ మూడు పాత్రలో నటిస్తుండటం.. టైటిల్లో జై, లవ, కుశ అనే మూడు పేర్లు కనిపిస్తుండటంతో ఇదే ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. మరి త్వరలోనే యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.