
11నుంచి ఎన్టీఆర్ 27?
‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిన్న ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.
‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిన్న ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్న కొత్త చిత్రానికి ఫిబ్రవరి 11న కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కొంచెం విరామం తీసుకున్నారు. తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో చేస్తారనే దానిపై పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరపాలనుకుంటున్నారట. ఆగస్టులో సినిమా విడుదల చే సేలా యూనిట్ భావిస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్‌ని పెట్టనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘జై లవకుశ’ నమోదు చేయించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు భోగట్టా. అన్నట్లు.. ఇది ఎన్టీఆర్‌కి 27వ సినిమా.