అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌.. | Nandamuri fans help to poor student in tirupati | Sakshi
Sakshi News home page

అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌..

Published Wed, Sep 20 2017 12:00 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

Nandamuri fans help to poor student in tirupati

తిరుపతి: నందమూరి అభిమానులు తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన జై లవకుశ చిత్రం విడుదల సందర్భంగా పేద విద్యార్థి చదువుకునేందుకు ఆర్థిక సాయం అందించారు. తిరుపతికి చెందిన పి. మోహిత్‌ అనే విద్యార్థికి 9వ తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లుగా నందమూరి ఫ్యాన్స్‌ డాట్‌ కాం ద్వారా ఆర్థిక సాయం అందిం‍చి చదివిస్తున్నామని తెలిపారు.

‘తుడా’ చైర్మన్‌ జి. నరసింహ యాదవ్‌ చేతుల మీదుగా ఆ విద్యార్థికి ఫీజు నిమిత్తం రూ. 17వేల  ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్‌ అభిమానులు పి. మనోహర్‌రెడ్డి, కేపీ. చౌదరి మాట్లాడుతూ.. గతంలో చిత్రం విడుదల సమయంలో ఫ్లెక్సీలు కట్టి, బాణ సంచాలు కాల్చి సంబరాలు జరుపుకునే వారమని చెప్పారు.

ఈ సంబరాల కన్నా పేద విద్యార్థులను చదివించేందుకు తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కారక్రమంలో పలువురు నందమూరి అభిమానులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement