రాశీ ఖన్నాకు క్రేజీ ఛాన్స్ | Rashi Khanna to Romance NTR | Sakshi

రాశీ ఖన్నాకు క్రేజీ ఛాన్స్

Jan 20 2017 10:35 AM | Updated on Sep 5 2017 1:42 AM

రాశీ ఖన్నాకు క్రేజీ ఛాన్స్

రాశీ ఖన్నాకు క్రేజీ ఛాన్స్

సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోతున్న యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా. తనతో పాటు ఇండస్ట్రీకి పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్, టాప్ హీరోలతో

సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోతున్న యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా. తనతో పాటు ఇండస్ట్రీకి పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్, టాప్ హీరోలతో సినిమాలు చేస్తుంటే.. రాశీ మాత్రం మీడియం రేంజ్ స్టార్లతోనే సరిపెట్టుకుంటోంది. ఒకటి రెండు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవటంతో కెరీర్ను మలుపు తిప్పే ఓ క్రేజీ ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది.

ఆ చాన్స్ ఇన్నాళ్లకు రాశీ ఖన్నా తలుపు తట్టింది. ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న రాశీఖన్నా త్వరలో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఓ యంగ్ హీరో సరసన నటించనుంది. జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటించనుంది. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవకుశ' సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అలరించనున్నారు. రాశీఖన్నాను ఒక హీరోయిన్గా ఫైనల్ చేయగా మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement