రాజమౌళి మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా..! | Rashi Khanna In Rajamouli Multistarrer | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 20 2018 3:23 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Ram Charan Rajamouli Ntr - Sakshi

రామ్ చరణ్‌, రాజమౌళి, ఎన్టీఆర్‌

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నాడు. టాలీవుడ్ లో టాప్‌ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇంత వరకు అధికారిక ప్రకటన లేకపోయినా మీడియాలో వస్తున్న వార్తలను రాజమౌళి ఖండించకపోవంటంతో ఇదే రాజమౌళి నెక్ట్స్ సినిమా అని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌.

అంతేకాదు ఈ సినిమాలో చరణ్‌, ఎన్టీఆర్‌లు బాక్సర్‌లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ గా రాశీఖన్నాను ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న. ఇటీవల తొలిప్రేమ సినిమాతో ఘనవిజయం అందుకున్న ఈ బ్యూటీ జక్కన్న సినిమాలో ఆఫర్‌ అంటే గోల్డెన్‌ ఛాన్స్‌ అంటున్నారు విశ్లేషకులు. పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement