దశమికి థియేటర్లలో... | NTR 'Jai Lava Kusha' was released on September 21 | Sakshi
Sakshi News home page

దశమికి థియేటర్లలో...

Published Sun, Jun 25 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

దశమికి థియేటర్లలో...

దశమికి థియేటర్లలో...

విజయదశమికి రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం సంప్రదాయం. రావణ దహనాన్ని చాలామంది వీక్షిస్తారు. ఈ దసరాకు రెండు రావణ దహనాలను చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు కలుగుతోంది. ఒకటి గుడిలో... రెండోది థియేటర్‌లో! ఎన్టీఆర్‌ హీరోగా కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’ను సెప్టెంబర్‌ 21న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అభిమానులకు రంజాన్‌ కానుకగా ఈ వార్తను వెల్లడించారు.

ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. రావణుడి లాంటి ఓ వ్యక్తిని (జై) మరో ఇద్దరు (లవ, కుశ) ఎలా అంతం చేశారనేది చిత్రకథ అట! రాశీ ఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా హిందీ నటుడు రోనిత్‌ రాయ్‌ తెలుగు తెరకు విలన్‌గా పరిచయమవుతున్నారు. జూలై తొలి వారంలో టీజర్‌ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 30న విజయదశమి. 21న నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ రోజున సినిమా విడుదల కానుందన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement