రామ్‌చరణ్, ఎన్టీఆర్
పక్కా ప్లానింగ్‌తో సినిమాలను కంప్లీట్ చేస్తారు రాజమౌళి. అంతేకాదు.. ఆయన సినిమాలు కూడా సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఉంటాయి. సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘బాహుబలి’ వంటి చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం గురించి ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ బాక్సర్స్‌గా కనిపించనున్నారట. అంతేకాదు అన్నదమ్ముల్లా కూడా నటిస్తారని కొందరి గాసిప్‌రాయుళ్ల ఊహ.
బాక్సర్లుగా వీరిద్దరూ ఎవరి భరతం పడతారన్నది స్క్రీన్‌పై చూడాల్సిందే. అయితే.. ఈ సినిమాలోని పాత్రల కోసం కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారట చరణ్ అండ్ ఎన్టీఆర్ . ఈ ట్రైనింగ్‌లో స్పెషల్ డైట్ ఫాలో అవ్వనున్నారట వీరిద్దరూ. నిర్మాత దానయ్య నిర్మించబోయే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన రాశీఖన్నా నటించనున్నారన్న వార్త కూడా హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment