boxers
-
భారత బాక్సర్లకు క్లిష్టమైన ‘డ్రా’
పారిస్: విశ్వ క్రీడల్లో భారత బాక్సర్లు పతకాలు సాధించాలంటే శక్తివంతమైన ‘పంచ్’లు విసరాల్సిందే. టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచిన లవ్లీనా బొర్గొహైన్... తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్‌తోపాటు ప్రీతి పవార్, జైస్మిన్ లంబోరియాలకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. 50 కేజీల తొలి రౌండ్లో నిఖత్ జర్మనీ ప్లేయర్ మాక్సీ క్లొట్జెర్తో ఆడుతుంది. ఈ బౌట్లో గెలిస్తే రెండో రౌండ్లో ప్రస్తుత ఆసియా చాంపియన్, వరల్డ్ చాంపియన్ వు యు (చైనా)తో తలపడాల్సి ఉంటుంది. ఈ అడ్డంకిని నిఖత్ దాటితే క్వార్టర్ ఫైనల్లో చుట్హమట్ రక్సాట్ (థాయ్‌లాండ్) లేదా సబీనా బొబోకులోవా (ఉజ్బెకిస్తాన్)లలో ఒకరితో ఆడుతుంది. ఇటీవల స్ట్రాండ్జా స్మారక టోర్నీ ఫైనల్లో సబీనా చేతిలో, గత ఏడాది ఆసియా క్రీడల సెమీఫైనల్లో రక్సాట్ చేతిలో నిఖత్ ఓడిపోయింది. ఈసారి 75 కేజీల విభాగంలో పోటీపడుతున్న లవ్లీనా తొలి రౌండ్లో సునీవా హాఫ్స్టడ్ (నార్వే)తో ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు ప్రత్యరి్థగా రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత లీ కియాన్ (చైనా) ఎదురుకావచ్చు. గత ఆసియా క్రీడల్లో ఫైనల్లో లీ కియాన్ చేతిలో లవ్లీనా ఓడిపోయింది. జైస్మిన్ (57 కేజీలు) తొలి రౌండ్లో నెస్తీ పెటెసియో (ఫిలిప్పీన్స్)తో ఆడుతుంది. తొలి రౌండ్లో జైస్మిన్ నెగ్గితే రెండో రౌండ్లో యూరోపియన్ చాంపియన్, మూడో సీడ్ అమీనా జిదాని (ఫ్రాన్స్)తో ఆడే అవకాశం ఉంది. ప్రీతి పవార్ (54 కేజీలు) తొలి రౌండ్లో వియత్నాం బాక్సర్ వో థి కిమ్ అన్‌తో ఆడుతుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఇద్దరు భారత బాక్సర్లు అమిత్ పంఘాల్ (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తొలి రౌండ్లో ‘బై’ పొందారు.బాక్సింగ్ మహిళల 54 కేజీల తొలి రౌండ్ బౌట్: ప్రీతి పవార్ ్ఠ థి కిమ్ అన్ వో (వియత్నాం); అర్ధరాత్రి గం. 12:05 నుంచి. టేబుల్ టెన్నిస్పురుషుల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్: హర్మీత్ దేశాయ్ ్ఠ జైద్ అబో యమన్ (జోర్డాన్) రాత్రి గం. 7:15 నుంచి.రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్: బలరాజ్ పన్వర్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).టెన్నిస్ పురుషుల డబుల్స్ తొలి రౌండ్: రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ ్ఠ రోజర్ వాసెలిన్–ఫాబియన్ రెబూల్ (ఫ్రాన్స్) మధ్యాహ్నం గం. 3:30 నుంచి.నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్బ్యాడ్మింటన్పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎల్’ తొలి లీగ్ మ్యాచ్: లక్ష్య సేన్ఠ్కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా) రాత్రి గం. 7:10 నుంచి. పురుషుల డబుల్స్ గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్x x లుకాస్ కొర్వీ–రోనన్ లాబర్ (ఫ్రాన్స్) రాత్రి గం. 8 నుంచి. మహిళల డబుల్స్ గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్: అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో x కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) రాత్రి గం. 11:50 నుంచి. -
Paris Olympics: ‘పంచ్’ పతకం తెచ్చేనా!
వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఒలింపిక్స్ బాక్సింగ్ క్రీడాంశంలో భారత్ నుంచి తొలిసారి 1948 లండన్ ఒలింపిక్స్‌లో ఏకంగా ఏడుగురు బాక్సర్లు పోటీపడ్డారు. ఆ తర్వాత 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో నలుగురు భారత బాక్సర్లు బరిలోకి దిగారు. అయితే ఈ రెండు ఒలింపిక్స్‌లో మన బాక్సర్లు ఆకట్టుకోలేకపోయారు. హెల్సింకి ఒలింపిక్స్ తర్వాత మరో నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం కరువైంది. మళ్లీ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు పోటీపడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్ (75 కేజీలు) కాంస్యం రూపంలో భారత్‌కు బాక్సింగ్‌లో తొలి పతకాన్ని అందించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మేరీకోమ్ (51 కేజీలు)... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత పొందారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు)... మహిళల విభాగంలో నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఆరుగురిలో అమిత్, లవ్లీనాలకు ఇవి రెండో ఒలింపిక్స్‌కాగా... నిశాంత్, నిఖత్, ప్రీతి, జైస్మిన్ తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనున్నారు. వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌పైనే అందరి దృష్టి ఉంది. ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాలు నెగ్గిన నిఖత్ తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్ పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టోక్యోలో కాంస్యం నెగ్గిన లవ్లీనా ఈసారి కూడా అద్భుతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్, నిశాంత్ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే కాంస్యాలు సాధించే చాన్స్ ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయి. –సాక్షి క్రీడా విభాగం -
జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు
న్యూఢిల్లీ: సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నీలో భారత్ 12 పతకాలు సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి. దీంతో భారత బాక్సింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమన్నా (48 కేజీలు), అంబేశొరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు), ప్రియాంక (66 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఫైనల్లో తమన్నా 5–0తో అలెనా ట్రెమసొవా (రష్యా)పై ఏకపక్ష విజయం సాధించడంతో ‘ఉత్తమ విదేశీ బాక్సర్’ కేటగిరీలో కూడా అవార్డు పొందింది. మిగతా ఫైనల్ బౌట్లలో అంబేశొరి 3–2తో డ్యునా సిపెల్ (స్వీడన్)పై, ప్రీతి దహియా 3–2తో క్రిస్టినా కర్టత్సెవా (ఉక్రెయిన్)పై నెగ్గారు. ప్రియాంక 5–0తో ఓల్గా పెట్రష్కొ (రష్యా)ను కంగుతినిపించింది. అంజూ దేవి (50 కేజీలు), సిమ్రన్ వర్మ (52 కేజీలు), మాన్సి దలాల్ (75 కేజీలు), తనిశ్‌బిర్ కౌర్ సంధు (80 కేజీలు) రజతాలు నెగ్గగా, ఆశ్రేయ (63 కేజీలు), నేహా (54 కేజీలు), ఖుషి (70 కేజీలు), అల్ఫియా (ప్లస్ 80 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. 20 దేశాలకు చెందిన 160 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇందులో 13 మంది సభ్యులతో కూడిన భారత బృందం 12 పతకాలు గెలుపొందడం విశేషం. -
ఒలింపిక్స్‌కు మరింత పకడ్బందీగా...
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్ షిప్లో బాక్సర్ల అద్భుత ప్రదర్శన (రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలు సహా 13 పతకాలు)తో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నూతనోత్సాహంతో ఉంది. ఈ ఫలితాలతో టోక్యో ఒలింపిక్స్ లక్ష్యంగా సమాఖ్య ప్రణాళికలు వేస్తోంది. చాంపియన్‌షిప్ పతకాల్లో కొన్నింటినైనా వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో నిలబెట్టుకోవాలని భావిస్తోంది. తమ తదుపరి లక్ష్యం ఇదేనని సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రకటించారు. ఇందులో భాగంగా విదేశీ పర్యటనలకు షెడ్యూల్‌కు పది రోజుల ముందే ఆటగాళ్లను పంపనుంది. వాతావరణ మార్పుల కారణంగా ఆహారానికి ఇబ్బంది రాకుండా చెఫ్‌లను పంపించే యోచన చేస్తోంది. సెప్టెంబరులో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌తో ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ‘ప్రతిష్ఠాత్మక క్రీడలకు బాక్సర్లను సర్వసన్నద్ధం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఏ ఒక్క అవకాశాన్నీ వదలం. ఇందులో భాగంగా మార్గదర్శకం, కోచింగ్, పోషకాహారం ఇలా ప్రతి అంశంపై శ్రద్ధ చూపుతాం’ అని మంగళవారం బాక్సర్ల సన్మాన కార్యక్రమంలో అజయ్ సింగ్ అన్నారు. ‘ఆసియా’ ప్రదర్శనకు గాను బాక్సర్లు, కోచ్‌లను ఆయన ప్రశంసించారు. ‘అర్జున’కు అమిత్, గౌరవ్ పేర్లు జకార్తా ఆసియా క్రీడల 49 కేజీల విభాగంలో, ఆసియా చాంపియన్‌షిప్ 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకాల విజేత అమిత్ పంఘాల్.... 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన గౌరవ్ బిధురి పేర్లను బీఎఫ్ఐ మంగళవారం ‘అర్జున అవార్డు’కు ప్రతిపాదించింది. వీరిలో అమిత్ పేరును గతేడాది కూడా పరిశీలనకు పంపారు. 2012లో డోప్ టెస్టులో విఫలమై ఏడాది నిషేధానికి గురైన నేపథ్యంలో అతడికి పురస్కారం దక్కలేదు. ఈ వివాదం సమసిన తర్వాత అమిత్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గాడు. మహిళల సహాయ కోచ్ సంధ్య గురుంగ్, మాజీ చీఫ్ కోచ్ శివ్ సింగ్‌లను ‘ద్రోణాచార్య’ అవార్డులకు ప్రతిపాదించారు. ఇక... ఇండియన్ బాక్సింగ్ లీగ్ దేశంలో క్రికెట్ సహా అనేక క్రీడా లీగ్‌లు విజయవంతమైన నేపథ్యంలో త్వరలో ‘ఇండియన్ బాక్సింగ్ లీగ్’ తెరపైకి రానుంది. రెండేళ్లుగా చర్చలు జరుగుతున్న ఈ లీగ్‌కు కార్యరూపం ఇచ్చి ఈ ఏడాది జులై–ఆగస్టు మధ్య నిర్వహించేలా బీఎఫ్ఐ ప్రణాళికలు వేస్తోంది. భారత మేటి బాక్సర్లు అమిత్ పంఘాల్, శివ థాపా, సరితా దేవి సహా విదేశీయులు కూడా పాల్గొనే లీగ్‌ను పురుషులు, మహిళల విభాగాల్లో మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించనున్నట్లు స్పోర్ట్జ్‌లైవ్ సంస్థ ఎండీ అతుల్ పాండే తెలిపారు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌ను ప్రారంభించిన ఈ సంస్థే... బాక్సింగ్ లీగ్ బాధ్యతలూ చూడనుంది. -
స్పెషల్ ట్రైనింగ్!
పక్కా ప్లానింగ్‌తో సినిమాలను కంప్లీట్ చేస్తారు రాజమౌళి. అంతేకాదు.. ఆయన సినిమాలు కూడా సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఉంటాయి. సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘బాహుబలి’ వంటి చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ బాక్సర్స్‌గా కనిపించనున్నారట. అంతేకాదు అన్నదమ్ముల్లా కూడా నటిస్తారని కొందరి గాసిప్రాయుళ్ల ఊహ. బాక్సర్లుగా వీరిద్దరూ ఎవరి భరతం పడతారన్నది స్క్రీన్‌పై చూడాల్సిందే. అయితే.. ఈ సినిమాలోని పాత్రల కోసం కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారట చరణ్ అండ్ ఎన్టీఆర్ . ఈ ట్రైనింగ్‌లో స్పెషల్ డైట్ ఫాలో అవ్వనున్నారట వీరిద్దరూ. నిర్మాత దానయ్య నిర్మించబోయే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన రాశీఖన్నా నటించనున్నారన్న వార్త కూడా హల్చల్ చేస్తోంది. -
చార్మినార్ వద్ద చెడ్డీలు అమ్మిన నటుడు!
సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసినవారందరికీ నవాజుద్ధీన్ సిద్ధిఖీ సుపరిచితుడే. ఆ సినిమాలో అతడు చేసిన 'రిపోర్టర్' పాత్ర అంత తేలికగా మరచిపోయేది కాదు. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తలాష్, కిక్ లాంటి సినిమాల్లో కూడా తనదైన నటనతో మెప్పించాడు సిద్ధిఖీ. అయితే తాజాగా అతడు చార్మినార్ సెంటర్లో చెడ్డీలు అమ్ముతూ కెమెరా కంటపడ్డాడు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.. తన సినిమా ప్రమోషన్ కోసం పడిన ప్రయాసే అది. బాలీవుడ్ తీరే వేరు. సినిమాను ప్రమోట్ చేయడానికి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు నటీనటులు. అవసరమైతే ఉన్నట్టుండి జనాల మధ్యలో ప్రత్యక్షమవుతారు కూడా. అచ్చంగా అలానే చేశాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫ్రీకీ అలీ' సినిమాలో సిద్ధిఖీ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో తన పాత్ర మాదిరిగా రోడ్డెక్కి చెడ్డీలు అమ్మాడు. చెడ్డీల వ్యాపారం సాగినంతసేపు ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఇక 'ఫ్రీకీ అలీ' కథ విషయానికొస్తే.. రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద చెడ్డీలు అమ్ముకుంటూ ఉంటాడు అలీ అనే కుర్రాడు. పార్ట్ టైం జాబ్‌గా ఓ రౌడీ దగ్గర పని చేస్తూ అతడితో కలిసి మామూళ్ల వసూళ్లకు వెళ్తుంటాడు. అలానే ఓ వ్యక్తి వద్ద వసూళ్ల కోసం గోల్ఫ్ కోర్టుకి వెళతాడు. అక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన అతనిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. అతనికో ఆశయాన్ని తెచ్చిపెడుతుంది. పేవ్మెంట్ చెడ్డీల వ్యాపారి.. ఆ తర్వాత పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడు ఎలా అయ్యాడనేదే కథ. సెప్టెంబరు 9 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ కోసం గురువారం హైదరాబాద్‌కు విచ్చేసింది చిత్ర యూనిట్. గోల్ఫ్ క్రీడాకారుడు కావడానికి అలీ పడిన పాట్లు హాస్యంతో కూడుకున్నవై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతుంది మూవీ టీం. అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. -
ఓడినా ‘కప్’ ఇచ్చారు!
ఏడు పదుల వయసులో ఏ ఆర్టిస్ట్ అయినా శరీరాన్ని కష్టపెట్టుకునే పాత్రలు చేయడానికి వెనకాడతారు. కానీ, అమితాబ్ బచ్చన్ వంటి కొంతమంది తారలు రిస్క్‌లు తీసుకోవడానికి రెడీ అయిపోతారు. ప్రస్తుతం నటిస్తున్న ఓ చిత్రంలో ఈ బిగ్ బి బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్లతో తలపడుతున్నారు. వాళ్ల ఉత్సాహం, ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేసిందనీ, వాళ్లతో బాక్సింగ్ రింగ్‌లో తలపడటం సవాల్‌గా అనిపించిందనీ అమితాబ్ అన్నారు. ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నా చిన్ననాటి విశేషాలు గుర్తొచ్చాయని అమితాబ్ చెబుతూ - ‘‘ఇష్టం ఉన్నా లేకపోయినా మా స్కూల్లో బాక్సింగ్ నేర్చుకోవాల్సిందే. పోటీల్లో ఒకే ఒక్క పాయింట్‌తో గెలుపోటములు ఆధారపడి ఉన్నప్పుడు భలే మజాగా ఉండేది. ఆ ఒక్క పాయింట్ దక్కించుకుని, ఆనందపడేవాణ్ణి. ఓసారి మాత్రం బాక్సింగ్ టోర్నమెంట్లో ఓడిపోయాను. అయినా కప్ ఇచ్చారు. గెలుపు కోసం ధైర్యసాహసాలను మెండుగా ప్రదర్శించినందుకుగాను ఆ కప్ గెల్చుకున్నా. వాస్తవానికి నా ఎత్తు నాకు మైనస్ అయ్యింది. నా బరువేమో లోయర్ కేటగిరీ వాళ్లకు సమానంగా ఉండేది. ఎత్తు మాత్రం హయర్ కేటగిరీకి సమానంగా ఉండేది. దాంతో నన్ను హయర్ కేటగిరీకే ఎంపిక చేసేవాళ్లు. వాళ్లేమో ‘ఆలోచించుకో. విరమించుకుంటేనే నీకు మంచిది. లేకపోతే దెబ్బలు తగలడం ఖాయం’ అని హెచ్చరించేవాళ్లు. కానీ, నేను మాత్రం ఆ హెచ్చరికను ఖాతరు చేసేవాణ్ణి కాదు. మొండిగా తలపడేవాణ్ణి. ఇప్పడు సినిమా కోసం బాక్సింగ్ చేస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి’’ అని చెప్పారు. -
స్వర్ణ బాలికలు