చార్మినార్ వద్ద చెడ్డీలు అమ్మిన నటుడు! | OMG! Nawazuddin Siddiqui caught selling boxers on the streets of Hyderabad! | Sakshi
Sakshi News home page

చార్మినార్ వద్ద చెడ్డీలు అమ్మిన నటుడు!

Published Fri, Aug 26 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

చార్మినార్ వద్ద చెడ్డీలు అమ్మిన నటుడు!

చార్మినార్ వద్ద చెడ్డీలు అమ్మిన నటుడు!

సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసినవారందరికీ నవాజుద్ధీన్ సిద్ధిఖీ సుపరిచితుడే. ఆ సినిమాలో అతడు చేసిన 'రిపోర్టర్' పాత్ర అంత తేలికగా మరచిపోయేది కాదు. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తలాష్, కిక్ లాంటి సినిమాల్లో కూడా తనదైన నటనతో మెప్పించాడు సిద్ధిఖీ. అయితే తాజాగా అతడు చార్మినార్ సెంటర్లో చెడ్డీలు అమ్ముతూ కెమెరా కంటపడ్డాడు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.. తన సినిమా ప్రమోషన్ కోసం పడిన ప్రయాసే అది.  

బాలీవుడ్ తీరే వేరు. సినిమాను ప్రమోట్ చేయడానికి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు నటీనటులు. అవసరమైతే ఉన్నట్టుండి జనాల మధ్యలో ప్రత్యక్షమవుతారు కూడా. అచ్చంగా అలానే చేశాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫ్రీకీ అలీ' సినిమాలో సిద్ధిఖీ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో తన పాత్ర మాదిరిగా రోడ్డెక్కి చెడ్డీలు అమ్మాడు. చెడ్డీల వ్యాపారం సాగినంతసేపు ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

ఇక 'ఫ్రీకీ అలీ' కథ విషయానికొస్తే.. రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద చెడ్డీలు అమ్ముకుంటూ ఉంటాడు అలీ అనే కుర్రాడు. పార్ట్ టైం జాబ్గా ఓ రౌడీ దగ్గర పని చేస్తూ అతడితో కలిసి మామూళ్ల వసూళ్లకు వెళ్తుంటాడు. అలానే ఓ వ్యక్తి వద్ద వసూళ్ల కోసం గోల్ఫ్ కోర్టుకి వెళతాడు. అక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన అతనిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. అతనికో ఆశయాన్ని తెచ్చిపెడుతుంది. పేవ్మెంట్ చెడ్డీల వ్యాపారి.. ఆ తర్వాత పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడు ఎలా అయ్యాడనేదే కథ.


సెప్టెంబరు 9 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ కోసం గురువారం హైదరాబాద్కు విచ్చేసింది చిత్ర యూనిట్. గోల్ఫ్ క్రీడాకారుడు కావడానికి అలీ పడిన పాట్లు హాస్యంతో కూడుకున్నవై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతుంది మూవీ టీం. అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement