ఎన్టీఆర్ కోసం ఇంట్రస్టింగ్ టైటిల్..? | kalyan ram rejesters interesting title for NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ కోసం ఇంట్రస్టింగ్ టైటిల్..?

Published Sat, Jan 7 2017 3:24 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

ఎన్టీఆర్ కోసం ఇంట్రస్టింగ్ టైటిల్..?

ఎన్టీఆర్ కోసం ఇంట్రస్టింగ్ టైటిల్..?

జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన జూనియర్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పవర్ ఫేం బాబీ దర్శకుడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు.

తాజాగా ఈ సినిమా టైటిల్కు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిలిం చాంబర్లో 'జై లవకుశ' అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. ఈ టైటిల్ ఎన్టీఆర్ సినిమా కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ మూడు పాత్రలో నటిస్తుండటం.. టైటిల్లో జై, లవ, కుశ అనే మూడు పేర్లు కనిపిస్తుండటంతో ఇదే ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. మరి త్వరలోనే యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement