Rumours On Dhawan Second Marriage: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం హైలెట్ అవుతుందో తెలియదు. కొన్ని రూమర్స్‌గా మిగిలిపోతాయి.. కొన్ని నిజాలుగా తేలుతాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకుంటే టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే కొద్ది రోజులు కిందట శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, ఓ భారత మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. శిఖర్ ధావన్, సదరు మహిళా క్రికెటర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయేషాతో విడిపోవడానకి ఇదే కారణమంటూ కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఇందులో నిజం ఉందా లేదంటే.. గాసిప్స్ రాయుళ్ల పనేనా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
చదవండి: CSK VS RR: ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’
Comments
Please login to add a commentAdd a comment