సాక్షి, విశాఖపట్నం: అమ్మోనియం నైట్రేట్ వల్ల నగరానికి ఎటువంటి ప్రమాదం లేదని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన రావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు గురించి విశాఖ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోర్టులో గత దశాబ్దన్నర కాలం నుంచి పూర్తి భధ్రతా ప్రమాణాలతో అమ్మోనియం నైట్రేట్‌ని రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. (ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే!)
అమ్మోనియం నైట్రేట్‌ని బొగ్గు గనులలో వినియోగిస్తారని రామ్మోహన రావు తెలిపారు. విశాఖ పోర్టులో కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. షిప్ వచ్చే ముందు పోర్టుకి సమాచారం వస్తుందని.. అన్ని అనుమతుల తర్వాతే హ్యాండ్లింగ్‌కి అనుమతిస్తామన్నారు. అమ్మోనియం నైట్రేట్ గురించి విశాఖ ప్రజలు అపోహ పడవద్దని రామ్మోహనరావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment