న్యూఢిల్లీ: కంపెనీల వ్యవహారాలపై మార్కెట్లో పుట్టే వదంతుల విషయంలో లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా స్పందించాల్సిందేనంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేసింది. తొలుత మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రీత్యా టాప్–100 కంపెనీలకు వదంతులపై స్పందించడాన్ని తప్పనిసరి చేసింది.
ఇందుకు ఈ ఏడాది అక్టోబర్ 1 గడువుగా పేర్కొంది. అయితే తాజాగా ఈ గడువును వచ్చే ఏడాది (2024) ఫిబ్రవరి 1 వరకూ పొడిగించింది. ఇక టాప్–250 మార్కెట్ క్యాప్ కంపెనీలకు 2024 ఏప్రిల్ 1 నుంచి కాకుండా 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలుకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment