అంజలి గురించి మళ్లీ... | rumors on Actress anjali | Sakshi
Sakshi News home page

అంజలి గురించి మళ్లీ...

Published Tue, Jan 3 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

అంజలి గురించి మళ్లీ...

అంజలి గురించి మళ్లీ...

నటి అంజలి గురించి చిత్ర పరిశ్రమలో మళ్లీ వదంతులు హల్‌చల్‌ చేస్తున్నాయి. కట్రదు తమిళ్‌ ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి అంజలి. తొలి చిత్రంలోనే మంచి బరువైన పాత్రను సమర్థవంతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అంగాడి తెరు చిత్రం ఆమెలోని నటనకు అద్దం పట్టిందనే చెప్పాలి. ఆ చిత్రం తరువాత ఈ పదహారణాల తెలుగమ్మాయి తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కాగా ఎంగేయుం ఎప్పోదుం చిత్రం అంజలిని కమర్షియల్‌ హీరోయిన్ గా నిలబెట్టింది. అంతే కాదు ఆ చిత్రం హీరో జై తో ప్రేమాయణం అంటూ వదంతులకు దారితీసింది. అంజలి, జై ల ప్రేమ పెళ్లికి దారి తీయనుందనే ప్రచారం జోరుగానే సాగింది. ఆ తరువాత అంజలి తన పిన్నితో మనస్పర్థల కారణంగా హైదరాబాద్‌కు వెళ్లిపోవడంతో ఆ వదంతులకు బ్రేక్‌ పడింది.

కాగా ఐదేళ్ల గ్యాప్‌ తరువాత మళ్లీ అంజలి తమిళ చిత్రాల్లో నటించడం మొదలెట్టడంతో నటుడు జై, అంజలి ఒకటయ్యారనీ, వారి మధ్య సన్నిహిత సంబంధాలంటూ మళ్లీ వదంతుల పర్వం మొదలైంది. తాజాగా రామ్‌ దర్శకత్వంలో ఆండ్రియాతో కలిసి తరమణి చిత్రంలో నటిస్తున్న ఈ బహుభాషా నటి ప్రస్తుతం యూకేలో ఉన్నట్లు సమాచారం. ఆమె చెన్నైకి తిరిగొచ్చాక ఈ రూమర్స్‌పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement