అవును... అది నిజమే! | Actress Anjali Confirms Her Love with Jai! | Sakshi
Sakshi News home page

అవును... అది నిజమే!

Feb 15 2017 11:15 PM | Updated on Sep 5 2017 3:48 AM

అవును... అది నిజమే!

అవును... అది నిజమే!

‘ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌’... ఎక్కడికైనా ఎప్పుడైనా అని దీనర్థం. ‘నీతో పాటు ఎక్కడికైనా వస్తా.. ఎప్పుడైనా వస్తా..

‘ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌’... ఎక్కడికైనా ఎప్పుడైనా అని దీనర్థం. ‘నీతో పాటు ఎక్కడికైనా వస్తా.. ఎప్పుడైనా వస్తా.. ప్రామిస్‌’ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు హీరో జై, హీరోయిన్‌ అంజలి అనుకున్నారేమో. నిజంగానే ఒకరి కోసం ఒకరు ఎంతదాకా అయినా వెళ్లేంత బలమైన బంధంలో ఉన్నారు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరూ లవ్‌లో పడ్డారనే వార్త వచ్చింది. ‘అదేం లేదు’ అని అడిగినవాళ్లకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ‘అవును’ అని జై చెప్పేశాడు. జై, అంజలి జంటగా నటించిన తాజా తమిళ చిత్రం ‘బెలూన్‌’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో చెన్నై మీడియా అంజలి గురించి ప్రస్తావించగా.. ‘‘నేనూ, అంజలి సన్నిహితంగా ఉంటున్న విషయం నిజమే.

 మా మధ్య మంచి స్నేహం, అవగాహన ఉన్నాయి. నాకు అంజలి అంటే ఇష్టం. తనకు నేనంటే ఇష్టం. ‘ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌’ సినిమాలో అంజలి నన్ను ఎప్పుడూ కొడుతుంటుంది. రఫ్‌ గాళ్‌లా కనిపిస్తుంది. కానీ, రియల్‌ లైఫ్‌లో తను అలా కాదు. చాలా సాఫ్ట్‌. ఆ స్వభావం నాకిష్టం. అంజలి ఎప్పుడైనా కోపంగా ఉన్నా, బాధలో ఉన్నా నేను కామెడీ చేసి, నవ్వించేస్తాను. అది తనకిష్టం’’ అన్నారు. ఈ మధ్య జై తన ఇంట్లో దోసెలు వేయడం, అంజలి కూడా అతని పక్కన ఉండటం, ఆ సమయంలో దిగిన ఫొటోలు ఇద్దరూ సోషల్‌ మీడియాలో పెట్టడం తెలిసిందే. ‘‘అంజలి మా ఇంటికి అప్పుడప్పుడూ వస్తుంటుంది. తనకు వంట బాగా వచ్చు.

 అంజలి వంట, ఆమె గుణం మా నాన్నగారికి ఇష్టం. నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు. వాళ్లతో అంజలి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది’’అని జై అన్నారు. ప్రేమికుల దినోత్సవం నాడు అంజలి హైదరాబాద్‌లో, తాను చెన్నైలో ఉన్నామని తెలిపారు. ఇంతకీ పెళ్లెప్పుడు అనే ప్రశ్న జై ముందుంచితే – ‘‘దాని గురించి ఇంకా ఆలోచించలేదు. అయినా నాకన్నా సీనియర్లు ఆర్య, విశాల్, శింబు ఉన్నారు.

ఆ ముగ్గురి పెళ్లీ అయిన తర్వాత మా పెళ్లి ఫిక్స్‌ చేస్తాం’’ అని తెలివిగా సమాధానం చెప్పారు. ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలి తన లవర్‌ గురించి బయటపెట్టలేదు. మామూలుగా లేడీస్‌ ఫస్ట్‌ అంటుంటారు. కానీ, ప్రేమను వ్యక్తం చేయడంలోనూ, అది నలుగురికీ చెప్పడంలోనూ దాదాపు అబ్బాయిలే ముందుంటారు. అంజలి కూడా జై నోటి నుంచే తమ లవ్‌స్టోరీ బయటకు రావాలని అనుకుని ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement