పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్న సామెత మాదిరిగా సెలబ్రిటీల గురించి ముఖ్యంగా సినీ హీరోయిన్‌ల గురించి సోషల్ మీడియాలో లేనిపోనివి రాసేస్తుంటారు. అంజలి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ అచ్చ తెలుగమ్మాయి ఫొటో చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. రామ్ దర్శకత్వంలో 'కట్రదు తమిళ్' చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అంజలి అక్కడ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తనకు తమిళంలో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. దీంతో అంజలి అక్కడ బిజీ హీరోయిన్‌గా మారింది.
స్టార్ హీరోలతో జోడీ
అలాంటి సమయంలోనే పిన్నితో మనస్పర్థలు తలెత్తడంతో హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఇది ఈమెకు ప్లస్సే అయ్యిందని చెప్పవచ్చు. ఇక్కడ వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకుంది. ఇకపోతే హీరో జైతో ప్రేమాయణం.. పెళ్లికి సిద్ధం అవుతున్న అంజలి అంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. దాన్ని అప్పట్లోనే అంజలి లైట్ తీసుకుంది. ఇప్పుడేమో.. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిందని ప్రచారం జరుగుతోంది.
తెలియకుండానే పెళ్లి చేస్తున్నారు!
దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అంజలి సినిమా రంగంలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పింది. దీంతో తనను ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకుని రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిపింది. తనకు తెలియకుండానే తన పెళ్లి చేసేస్తుండడంతో నవ్వు వస్తోందని పేర్కొంది. తమిళంలో ఈమె నటించిన ఏళు కడల్ ఏళు మలై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మరోవైపు గీతాంజలి 2 కూడా త్వరలో రిలీజ్ కానుంది.
చదవండి: షూటింగ్‌లో గాయపడ్డ హీరో నితిన్?
Comments
Please login to add a commentAdd a comment