
ఈ మధ్య ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో తెలియడం చాలా కష్టం. వార్తలు క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తారలకు ఆ వార్తలో నిజం లేదంటూ బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ మధ్య శ్రీనివాస్ రెడ్డి, ఎన్టీఆర్‌కు చెడిందని, షూటింగ్ సమయాల్లో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే వాటిలో నిజం లేదంటూ.. ఎన్టీఆర్‌కు తనకు మధ్య ఉన్న బంధాన్ని తెలిసేలా ఓ పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు శ్రీనివాస్ రెడ్డి. ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇలాంటి సంఘటనే నిన్న వైరల్‌గా మారింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా షూటింగ్‌లో ప్రకాష్ రాజ్, అనుపమా పరమేశ్వరన్‌ల మధ్య గొడవలు జరిగాయని, అనుపమా కంటతడి పెట్టుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదన్నట్టుగా అనుపమ, ప్రకాష్‌రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎనర్జీటిక్ స్టార్ రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.
Those jokes .... 🤣🤣🤣@prakashraaj Sir .... 😇 pic.twitter.com/Ym9cbpaifM
— Anupama Parameswaran (@anupamahere) July 8, 2018